నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని త్రీ టౌన్ ప్రాంతంలోని గాంధీ చౌక్‌లో కిరాణం డ జాగిరి మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావుతో స్థానిక కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్రావు మండపం రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకరపర్తి రాంప్రతాప్, పల్ల బోతూ శ్రీనివాసరావు, పుల్లకాండం వినరు పాల్గొన్నారు.
కూసుమంచి : మండల వ్యాప్తంగా వాడ, వాడన వినాయక చవితి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు విగ్రహాలు ఏర్పాటు చేసుకొని సంబరాలు నిర్వహించారు.