ఘనంగా ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాలు

నవతెలంగాణ-మల్లాపూర్‌
మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో యువజన సంఘాలు వివిధ ఆకృతులల్లో మండపాలను ఏర్పాటుచేసి వినాయకుడి విగ్రహాలను ఊరేగింపుగా మండ పాల వద్దకు తీసుకువచ్చి ప్రతిష్టాపించారు. అనంతరం ప్రతి ఒక్కరూ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం వినాయక నవరాత్రి ఉత్సవాలు భాగంగా దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకట్రాపేట్‌లో యువరెడ్డిస్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు. అన్నదాన దాత అయిత నవ్యరెడ్డి – అవినాష్‌ రెడ్డి, కృశివ్‌రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదానాన్ని ప్ర్రారంభిచారు. ఈ కార్యక్రమలో విగ్రహ దాత గడ్డం రాజారెడ్డి – లలిత,ఎల్లల కృష్ణారెడ్డి, తుక్కారెడ్డి,జీవన్‌రెడ్డి, సంత శ్రీనివాస్‌, బియ్యం హరీష్‌, యూత్‌ కమిటీ సభ్యులు, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love