నేడు ఎస్బి పల్లిలో వినాయక శోభాయాత్ర

– కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్‌ మండపం వద్ద ప్రత్యేక పూజలు
– లక్ష 15 వేలు పలికిన లడ్డు వేలం
– దక్కించుకున్న ఎమ్మె రిషికేశ్‌, రానా ప్రతాప్‌ సోదరులు
– అన్నదానం ఏర్పాటు చేసిన
– జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ
నవతెలంగాణ-కొత్తూరు
గణేష్‌ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవడానికి యువత సహకరించాలని కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ అన్నారు. మండలంలోని ఎస్‌బిపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్‌ మండపం వద్ద జడ్పీటీసీ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. ప్రజలంతా దైవచింతనతో మెలిగి గణనాధుని ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు. అనంతరం ఆమె భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గణేష్‌ మండప కమిటీ సభ్యులు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతా సత్యనారాయణ, సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌, ఎంపీటీసీ రవీందర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఎమ్మె వెంకటయ్య, ఉప సర్పంచ్‌ ఎమ్మె బాలరాజు, గ్రామ పెద్దలను శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షులు కడల శ్రీశైలం, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ ఎమ్మె అజరు, ఎర్ర ఆంజనేయులు, అంబటి కష్ణయ్య, జామకాయల కష్ణయ్య, ఎమ్మె వెంకటయ్య, ఎస్బిపల్లి బీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు కుమ్మరిగూడెం పాండు, ఎమ్మె నర్సింహా, భీరప్ప, గణేష్‌ మండప కమిటీ సభ్యులు, కురుమ సంఘ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love