ప్రగతిభవన్‌లో ఘనంగా వినాయక చవితి

– సీఎం కేసీఆర్‌ దంపతుల పూజలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వినాయక చవితి వేడుకలు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలనీ, అందరినీ చల్లగా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలనీ, విఘ్నేశ్వరుడిని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. గణపతి పూజ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, ఆయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్యతోపాటు మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, ప్రగతిభవన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love