నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ ఛైర్ పర్సన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని కౌన్సిలర్లు పొద్దుటూరి మురళీధర్ రెడ్డి, బదాం రాజ్ కుమార్ ,,డార్లింగ్ రమేష్ లు తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనం యందు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరినారు. . మున్సిపాలిటిలో మున్సిపల్ చైర్ పర్శన్ పండిత్ వినీత పై ఈనెల నాల్గవ తేదీ మున్సిపల్ కార్యాలయం అవిశ్వాస తీర్మాణానికి సమా వేశము నిర్వహించినారు. ఇట్టి సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారి, మున్సిపల్ కమీషనర్ ఆద్యరములో జరిగినది. అని, మున్సిపల్ యందు మున్సిపల్ కౌన్సిలర్ ల సంఖ్య 36 సభ్యులు ,ఎక్స్ అఫిషియ గా ఎమ్మెల్యే సైడి రాకేష్ రెడ్డి కల్గి యున్నారు. కావున మొత్తం సభ్యుల సంఖ్య 37గా కల్గి యియింది. కావున అవిశ్వాసానికి కావలసిన సంఖ్య 2/3 వంతు కావలసి యున్నందున.. మొత్తం సభ్యుల సంఖ్య 25 సభ్యులు కావలసి ఉంటుంది అని అన్నారు.. అవిశ్వాసము నెగ్గడానికి ఆర్ డి ఓ నిర్వహించిన ఓటింగ్ లో 25 సభ్యులు పాల్గొని అందులో 24 మంది సభ్యులు మాత్రమే అవిశ్వాసానికి మద్దతుగా చేతులు ఎత్తి మద్దతు తెలిపినారని. అన్నారు.. ఎక్స్ అఫిషియ అయిన ఎమ్మెల్యే తటస్థముగా ఉండటము వలన అవిశ్వాసానికి కావలసిన సంఖ్య 25 కు సరిపోనందున, మున్సిపల్ చైర్ పర్శన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తిర్మాణము వీగి పోయింది ఇట్టి విషయముపై జిల్లా కలెక్టర్ ను సైతం ఆ మరుసటి రోజు 5వ తేదీ కలిసి తిరిగి మున్సిపల్ చైర్పర్సన్ గా పండిత్ వినీత పవన్ ని కొనసాగించాలని కోరినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.