వినేశ్‌ ఫొగాట్‌ షాకింగ్‌ నిర్ణయం..రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘‘కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు’’ అని పేర్కొంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరిన వినేశ్‌.. అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురైంది. మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ ఫొగాట్‌ కోర్ట్‌ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై ఆ ఆర్భిట్రేషన్‌ తీర్పు వెలువడించాల్సి ఉంది. ఇంతలోనే వినేశ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Spread the love