మణిపూర్‌లో మళ్లీ హింస..

ఇంఫాల్‌ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో శుక్రవారం మరోసారి హింస చెలరేగింది. తెంగ్నౌపాల్‌ జిల్లాలోని పల్లెల్‌ పట్టణంలో సాయుధ స్థానికులు , భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. 20 మందికిపైగా గాయపడినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతంఅక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టు తెలిపాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులతో కూడిన భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నట్టు పేర్కొన్నారు.

Spread the love