చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..

నవతెలంగాణ హైదరాబాద్: భారత క్రికెట్‌ ప్రపంచంలో ఒక‌ప్పుడు స‌చిన్ టెండూల్క‌ర్ హిరో అయితే ఇప్పుడు విరాట్ కోహ్లి రికార్డుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్నాడు. ఎన్నో రికార్డుల‌ను ఇప్ప‌టికే అత‌డు బ‌ద్ద‌లు కొట్టాడు. తాజాగా మ‌రో రికార్డు అత‌డి ఖాతాలో చేరింది. ఒకే వేదికపై వంద టీ20 మ్యాచులు ఆడిన ఏకైక భార‌త క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. మంగ‌ళ‌వారం ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌తో కోహ్లి ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 16 బంతులు ఎదుర్కొని 22 ప‌రుగులు సాధించాడు. విరాట్ కోహ్లి త‌రువాత ఈ జాబితాలో ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఉన్నాడు. అత‌డు ముంబైలోని వాంఖ‌డే మైదానంలో 80 మ్యాచులు ఆడాడు. వీరిద్ద‌రి త‌రువాత చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిలిచాడు. ధోని చెన్నైలోని చెపాక్ మైదానంలో 69 మ్యాచులు ఆడాడు. ఈ ముగ్గురు మాత్ర‌మే ఒకే వేదిక‌పై అత్య‌ధిక మ్యాచులు ఆడారు.

Spread the love