ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్..!

నవతెలంగాణ – రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ని బీజేపీ ఎంపికచేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ని ఎన్నుకున్నట్లు తెలిపాయి. ఆయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు సన్నిహితుడు.

Spread the love