నవోదయకు విశ్వదీప్తి పాఠశాల విద్యార్ధిని ఎంపిక

– అభినందించిన పాఠశాల కరస్పాండెంట్ ఎంకె సుదర్శన్
– హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
నవతెలంగాణ-  మల్హర్ రావు
ఇటీవల నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి.ఈ నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామంలోని విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం ప్రయివేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న దేవునూరి అక్షయ  ఎడ్లపల్లి గ్రామానికి చెందిన చిన్నారి ఆరవ తరగతి ప్రవేశం కొరకు నవోదయలో అర్హత సాధించినట్లుగా విశ్వదీప్తి పాఠశాల కరస్పాండెంట్ ఎంకె సుదర్శన్ మంగళవారం తెలిపారు. అక్షయ నవోదయకు ఎంపికైన సందర్భంగా బాలికను అభినంధించి,మేమేంటో అందజేశారు. తమ కూతురు నవోదయకు ఎంపిక కావడం పట్ల ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love