విశ్వకర్మ భగవాన్ జయంతి అధికారికంగా నిర్వహించాలి..

– బ్రహ్మశ్రీ చిలుమోజు  వీర నారాయణ చార్యులు
నవతెలంగాణ -సుల్తానాబాద్  :
శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి  ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించి,సెలవు దినంగా ప్రకటించాలని బ్రహ్మశ్రీ చిలు మోజు వీర నారాయణ చార్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో  విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి  వేడుకలు   ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు  వీర నారాయణ చార్యులు విరాట్ విశ్వకర్మ భగవాన్ చిత్ర పటానికి పూలమాలవేసి, జెండా ఆవిష్కరించి, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ భగవాన్ జన్మించాడని, విశ్వకర్మ భగవాన్ ఐదు ముఖాలు కలవాడని, నిత్యం విరాట్ విశ్వకర్మ భగవాన్ పూజిస్తే అతివృష్టి అనావృష్టి దరిచేరదని, పాడిపంటలు వృద్ధి చెంది సకల సంపదలు అభివృద్ధి చెందాయని అన్నారు. అదేవిధంగా సృష్టికి మూల కారణం విశ్వభాగనుడే అని, సెప్టెంబర్ 17న శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని, సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ  చిలుమోజు వీర నారాయణ చార్యులు, పూసల ఆంజనేయులు,  చారి ,దాసోహం వెంకటేశ్వర్లు, జూపాక  కుమారస్వామి ,శ్రీమంతుల సదానందం, పూసాల రమేష్ ,పూసల లక్ష్మీనారాయణ, దాసోహం అనిల్, సంతోష్, రాజు, కమలాకర్, బాలయ్య ,వెంకటా చారి ,రమేష్, గోపి, సంపత్  సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love