విశ్వరూప మహా సభ కరపత్రాలు విడుదల

నవతెలంగాణ -ఎల్బీనగర్‌
ఎల్బీనగర్‌ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబే ద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాల దగ్గర మాదిగల విశ్వరూప మహాసభ బత్తిన సుధా కర్‌ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం కరపత్రా లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు తెలుగు నేలపై మానవీయ కోణంలో ప్రజల పక్షాన ఉద్యమం చేసిన చరిత్ర ఎమ్మార్పీఎస్‌ మహా జననేత మందకష్ణ మాదిగ నాయక త్వానికి మాత్రమే ఉన్నదని గుర్తు చేశారు. ఈ నెల 11న పెరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభ కు మాదిగ ,మాదిగల ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యాక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ రాష్ట్ర కళా మండలి అధ్యక్షులు మల్లె పాక అనిల్‌ కుమార్‌ మాదిగ, ప్రకాష్‌ మాదిగ, శేఖర్‌ మాదిగ, రవి మాదిగ, నాగరాజు మాదిగ, యాదయ్య మాదిగ, గిరి మాదిగ, మహర్షి మాదిగ, మౌలాలి మాదిగ, ప్రవీణ్‌ మాదిగ, రంగయ్య మాదిగ, లోకయ్య మాదిగ, ప్రకాష్‌ మాదిగ, ఏ బు మాదిగ, ఐసం మాదిగ,శాస్త్రి మాదిగ,అయ్యా స్వామి మాదిగ, ఏబు లింగం, నాగరాజు, మహర్షి, యాదయ్య పెద్దగిరి, చిన్నగిరి, కిషోర్‌, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love