దార్శనిక ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ..

– కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి
– మండలంలో రాజీవ్ గాంధీ వర్థంతి దినోత్సవం
నవతెలంగాణ – బెజ్జంకి 
దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడానికి విశేష సేవలందించి రాజీవ్ గాంధీ దార్శానికా ప్రధానమంత్రిగా చిరస్మరణీయుడయ్యాడని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కొనియాడారు.మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.నాయకులు అక్కరవేణి పోచయ్య,లింగాల శ్రీనివాస్,మంకాల ప్రవీన్,రొడ్డ మల్లేశం,గూడెల్లి శ్రీకాంత్,బండిపెల్లి రాజు,మానాల రవి,చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,మెట్ట నాగారాజు,జెల్లా ప్రభాకర్,మాజీ సర్పంచులు ద్యావనపల్లి శ్రీనివాస్, రావుల నర్సయ్య,మాజీ ఉప సర్పంచ్ హరికృష్ణ, మిట్టపల్లి చెన్నారెడ్డి,బైరి సంతోష్,కొంపల్లి మల్లేశం, అయా గ్రామాల కార్యకర్తలు హజరయ్యారు.
Spread the love