ఓటర్ నమోదు కోసం  పోలింగ్ స్టేషన్ల సందర్శన 

నవతెలంగాణ-రామగిరి 
స్పెషల్ క్యాంపెన్ డేస్ సందర్బంగా రామగిరి మండలంలోని అన్ని పొలింగ్ స్టేషన్లను మండల తహసీల్దార్ బి రామచందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్టోబర్ 1 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రతి  పోలింగ్ స్టేషన్ కు బిఎల్ ఓ లు వస్తారని, వారికి ఓటర్ కు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ కార్డు, పదవ తరగతి మెమో, పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి అందజేయాలని, ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు
Spread the love