సోనుసూద్‌ విగ్రహం సందర్శన

– గుర్రం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లిన సోనుసూద్‌ బృందం
నవతెలంగాణ – బోనకల్‌
మండల పరిధిలో ని గార్లపాడు గ్రామంలో గల సోనుసూద్‌ విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన సోను సూద్‌ బృందమైన అజ్మల్‌, గుల్షన్‌ కోహ్లి శనివారం సందర్శించారు. గార్లపాడు గ్రామంలో సోనుసూద్‌ విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలుసుకున్న వారు ప్రత్యేకంగా పరిశీలించడానికి ఢిల్లీ నుంచి వచ్చారు. అనంతరం విగ్రహాన్ని ప్రతిష్టించిన గుర్రం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి వారిని పలకరించి అభినందించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ గార్లపాడు గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించటం చాలా సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి జరిగే సోను సూద్‌ పుట్టినరోజు వేడుకలకు సోను సూద్‌ ను తప్పకుండా గార్లపాడు గ్రామానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గుర్రం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 14 నవంబర్‌ 2021న ఈ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినట్లు వారికి వివరించారు. తాను చిన్నతనం నుంచే సోనూసూద్‌ అంటే చాలా ఇష్టమన్నారు. కరోనా సమయంలో కూడా ఆయన చేసిన సేవలు చూసి సోనుసూద్‌ విగ్రహం ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోనుసూద్‌ను మా గ్రామానికి తప్పకుండా తీసుకురావాలని బృందాన్ని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ముక్కపాటి అప్పారావు, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్‌, ముక్కపాటి వీరయ్య, కేతినేని సత్యనారాయణ, గంధం పుల్లయ్య, గంధం వంశీ, గంధం ఆనంధ్‌, గుర్రం వేణు, గుర్రం విష్ణు, మోదుగు అశోక్‌, కనకపొడి కోటి, మోదుగు ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love