ట్రంప్‌ కార్యవర్గంలో మస్క్‌, వివేక్‌కు కీలక బాధ్యతలు

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా ఎన్నికల్లో  ట్రంప్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్‌ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ట్రంప్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామిలకు ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రక్షాళన, మితిమీరిన నింబధనల కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్‌ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు.

Spread the love