చంద్రబాబును కలిసిన వివేకా కుమార్తె సునీత దంపతులు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు తమపై అక్రమ కేసులు పెట్టారని ముఖ్యమంత్రికి సునీత తెలిపారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలపై విచారణ జరిపించాలని కోరారు. సీఐడీ చేత విచారణ జరిపించి వాస్తవాలు వెలికి తీయాలని చెప్పారు. సునీత విన్నపం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలుసని చంద్రబాబు చెప్పారు. విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.
Spread the love