ఇండస్‌ యాప్‌స్టోర్‌లో వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌

ఇండస్‌ యాప్‌స్టోర్‌లో వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌బెంగళూరు : ఫోన్‌పేకు చెందిన ఇండస్‌ యాప్‌స్టోర్‌ ఇంగ్లీష్‌తో పాటు 10 భారతీయ భాషలలో వాయిస్‌ సెర్చ్‌ ఫీచర్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. ఈ వినూత్న ఫీచర్‌తో వినియోగదారులు తమకు నచ్చిన భాషలో వాయిస్‌ సెర్చ్‌ చేసి యాప్‌లను వెతికేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. వాయిస్‌ సెర్చ్‌ టెక్నాలజీ అనేది ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌ల సహకారంతో పని చేస్తుందని ఇండస్‌ యాప్‌స్టోర్‌ సహ వ్యవస్థాపకుడు, సిపిఒ ఆకాష్‌ డోంగ్రే పేర్కొన్నారు.

Spread the love