నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు ఎస్ ఐ సిహెచ్ కరుణాకర్ రావు తెలిపారు. శుక్రవారం పసర పోలీస్ స్టేషన్ లో ఎస్ఐసిహెచ్ కరుణాకర్ రావు మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ నుండి ఒక టీం పోలీస్ స్టేషన్లో పేర్లతో సహా నమోదు చేయించుకోవాలి. క్రీడాకారులందరూ గోవిందరావుపేట మండలానికి చెందిన వారై ఉండాలి. ఆధార్ కార్డు చూపించాలి. 18, 19 తేదీలలో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తామని అన్నారు. ప్రథమ బహుమతి 5016/- రూపాయలు ద్వితీయ బహుమతి 3016/- రూపాయలు ప్రకటించడం జరిగింది. మరిన్ని వివరాల కొరకు డిఎస్ పీ ములుగు 8712670103, సీఐ పసర 8712670112, ఎస్ ఐ పసర 8712670085 నంబర్లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని అన్నారు.