యేదేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా

నవతెలంగాణ- మోపాల్
మోపాల్ మండల కేంద్రంలోని ముదక్ పల్లి శివారు లో గల పెద్ద వాగు నుండి యేదేచ్ఛగా రాత్రుళ్ళు ఇసుక తవ్వకాలు డంపింగ్ చేసి నిజామాబాద్ కు తరలిస్తున్నరు.  గ్రామాల్లో విఆర్ఓ వ్యవస్థ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది రెవెన్యూ యంత్రంగానికి సమాచారం ఉండేది. అక్రమంగా మో, ఇసుక రవాణా చేసే వారికి గుర్తించి సంబంధించిన అధికారులకు తెలియపరిచేవారు. ఈరోజు అయితే విఆర్ఓ వ్యవస్థని తీసేశారు ఆరోజు నుండి అక్రమంగా ఈరోజు అయితే విఆర్ఓ వ్యవస్థని తీసేశారు ఆరోజు నుండి అక్రమంగా ఇసుక మరియు మొరం తవ్వేవారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. విఆర్ఓ వ్యవస్థ ఉంటే వారు అనుక్షణం మరొక సమాచారం ఇవ్వడం వల్ల వారి పైన చర్యలు ఉండేవి. అర్ధరాత్రి మధ్యలో ఇదంతా సాగిస్తున్నట్లు సమాచారం. పోలీసు వ్యవస్థ అయినా పెట్రోలింగ్ చేస్తూ సంబంధించిన వారిని గుర్తించి చట్టపరామైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love