– నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. క్రమశిక్షణ నేర్పాల్సిన వారు క్రమశిక్షణ తప్పిన సంఘనట బాన్సువాడ నియోజకవర్గం లోని కొత్తాబాది మోడల్ స్కూల్ లో చోటు చేసుకుంది. మోడల్ స్కూల్ ప్రధాన గేటు ద్వారా నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు వస్తూ వెళ్ళుతుంటారు. అందులో బోధించే ఉపాధ్యాయులు,సిబ్బంది తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా నిలుపుతుండడం వల్ల ప్రధాన గేటు ద్వారా వెళ్లే విద్యార్థులకు, మిగత ఉపాధ్యాయులకు సిబ్బందికి తీవ్ర అవ్యవస్థ నెలకొంది. మోడల్ స్కూల్ ప్రాంగణంలోకి ఇతర ద్విచక్రవాహనాలే కాకుండా ఆటోలు, కార్లను కూడా వచ్చి ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. గేటు ముందు అడ్డదిడ్డంగా వాహనాలను పెట్టడంతో విద్యార్థుల తల్లితండ్రులు ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో కొత్త బాది మోడల్ స్కూల్ మంచి గుర్తింపు ఉంది. అందుకు బాన్సువాడ నియోజకవర్గం విద్యార్థులే కాకుండా ఇతర ప్రాంతాల విద్యార్థులు వారి తల్లితండ్రులు వస్తు వెళ్ళుతుంటారు. మోడల్ స్కూల్ ప్రాంగణంలో పార్కింగ్ స్థలం సక్రమంగా లేకపోవడం వల్ల ఆడ్డగోలుగా వాహనాలు పార్క్ చేస్తున్నారు.వర్షం వచ్చిందంటే చాలు చిన్న ,పెద్ద తేడాలేకుండా వాహనాలను గేట్ ముందు పార్కింగ్ చేస్తున్నారు. విద్యార్థులకు బోధన చెప్పేందుకు వచ్చిన ఉపాధ్యాయుల సిబ్బంది వాహనాలను వర్షంతో నని, ఎండకు ఎండి పోతున్నాయని ప్రభుత్వం స్పందించి ఓ పక్కన పార్కింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, గేట్ వద్ద ఎలాంటి వాహనాలు నిలపవద్దని, గ్రామస్తులు తెలిపారు.
ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బంది
బాన్సువాడ మండలం కొత్త బాది మోడల్ స్కూల్ లో చదువుకునే విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సులను వెళ్ళాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఫకీరయ్య తెలిపారు. గతంలో బాన్సువాడ డిపో నుంచి 4 ఆర్టీసీ బస్సులను నడిపేవారని ఇప్పుడు రెండు మూడు బస్సులు వేస్తున్నారని అందుకు ఇబ్బందిగా మారింది. విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సులను నడపాలని కోరారు.