– ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత..
నవతెలంగాణ-వైరాటౌన్
సీపీఐ(ఎం)పార్టీకి ఓట్లు వేసి మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలని ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత విజ్ఞప్తి చేశారు. దీపావళి రోజున సీపీఐ(ఎం) వైరా అసెంబ్లీ అభ్యర్థి భూక్యా వీరభద్రం విజయాన్ని కాంక్షిస్తూ పార్టీ సింబల్ తో ముగ్గులు వేసి వినూత్నంగా ప్రచారం చేశారు. ఒకవైపు సీపీఐ(ఎం) పార్టీకి ఓట్లు వేయాలని, మరోవైపు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుత్తికొండవలి నక్షత్రం సింబల్ తో గుడిమెట్ల రజిత వేసిన ముగ్గు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నది, పలువురి ప్రశంసలు అందుకున్నది.