నీతి.. నిజాయితీకి… ఓటెయ్యండి

– నీతి నిజాయితీగా బతకడం కోసమే సిపిఎంలో కంకణ బద్ధున్నైనా
 – ప్రజాసేవకే అనునిత్యం కృషి
 – పేదల పక్షాన అనునిత్యం పోరాటం చేసేది సీపీఐ(ఎం) మాత్రమే
– డబ్బు సంచులతో వచ్చే నాయకులకు బుద్ధి చెప్పాలి
 – సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి 
 నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : ఎన్నికలు వచ్చినప్పుడు అనేకమంది డబ్బు సంచులతో మేమున్నామని వస్తున్నారు.  ప్రజలు ఆలోచించి నీతి.. నిజాయితీకి ఓటు వేయాలని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పేద ప్రజల పక్షాన నిలుస్తూ వారి సమస్యల పైన అనునిత్యం పోరాటం చేసేది సీపీఐ(ఎం) మాత్రమేనని స్పష్టం చేశారు. శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిప్పర్తి మండలంలోని రైతు సమస్యలను దృష్టిలో ఉంచుకొని సాగు, తాగునీరు కోసం సీపీఐ(ఎం) అనేక ఉద్యమాలు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల వాటర్ ట్యాంకులు, రోడ్డు నిర్మాణాలు, వ్యవసాయ నీటి కాలువలు కోసం ఎన్నో ఆందోళన  కార్యక్రమాలు ఇలా ప్రజల కోసం నిత్యం పోరాటాలు  చేసి జైలు జీవితం  గడిపిన అనుభవం తనకు ఉందన్నారు. నీతి.. నిజాయితీగా బతకడం కోసం సిపిఎం పార్టీలో కంకణ బద్ధునై,  ప్రజల సేవ కోసమే  అనునిత్యం కృషి చేస్తానని  అన్నారు. ప్రస్తుతం పోటీ చేసి ప్రజల ముందుకు వచ్చిన నాయకులందరూ  డబ్బుల సంచులతో వచ్చి గెలిచిన తర్వాత అంతకు రెట్టింపు సంపాదించుకునే పనిలో ఉంటారని అలాంటివారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు కోవిడ్ సమయంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో  ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా వచ్చినటువంటి వారికి సీపీఐ(ఎం) అన్నివేళలా అందుబాటులో ఉండి సేవలందించిందని గుర్తు చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరిగిందని రైతుల వ్యవసాయ అవసరాలు దృష్టిలో ఉంచుకొని డి40 కాల్వ కోసం సీపీఐ(ఎం) ఉద్యమం చేసిందని,  కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తామని కార్మికుల కోసం అనునిత్యం పోరాటం చేసే ఏకైక పార్టీ సీపీఐ(ఎం) మాత్రమే అని తెలిపారు.  అలాంటి సీపీఐ(ఎం) పార్టీ తరఫునుండి పోటీ చేసిన నాకు ప్రజల సేవ చేయడం కోసం అధిక ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నన్నూరు వెంకటరమణారెడ్డి, ఎండి. సలీం, తుమ్మల పద్మ, సిపిఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్యం బిక్షం, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు భీమిరెడ్డి సీతారాం రెడ్డి, మాడుగుల పల్లి  సహాయ కార్యదర్శి శ్రీకర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్, సిఐటియు తిప్పర్తి మండల కన్వీనర్ భీమగోని గణేష్, సీపీఐ(ఎం) మండల నాయకులు గండమల్ల రాములు, ఆకిటి లింగయ్య, పరశురాములు మల్లారెడ్డి శంకర్, కృష్ణయ్య మాధవ్, చిట్టి అశోక్ రెడ్డి, రొట్టెల జానయ్య, పేరం లింగయ్య,  జేరిపోతుల జానయ్య, కాశి రాములు,   ఐద్వ తిప్పర్తి మండల నాయకురాలు జంజరాల ఉమా భార్గవి, డివైఎఫ్ఐ నాయకులు  దొంగరి నవీన్,  సలీంద్ర, సంతోష, పద్మ, రమ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love