సానుకూల మార్పు కోసం ఓటు వేయండి: మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ – న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టు వేదికగా రాష్ట్రంలో సానుకూల మార్పుకోసం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఈరోజు రెండో దశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు తమ ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం పెద్ద సంఖ్యలో తరలిచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఓటు సానుకూల మార్పుకు దోహదపడుతుంది. మీ భవిష్యత్తుకు భద్రతను కల్పిస్తుంది. సంక్షేమానికి హామీనిస్తుంది. ఒకేఒక్కఓటు మీ రాజ్యాంగ హక్కులను సంరక్షిస్తుంది. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్న ఓటర్లను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ ఎన్నికలు జమ్మూకాశ్మీర్‌కు మలుపు. ఈ కీలకమైన మార్పు జరగాలంటే ప్రజాస్వామ్య శక్తిని ఉపయోగించుకుందాం’ అని ఖర్గే ఎక్స్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తగ్గించిన తర్వాత ఆ రాష్ట్రంలో నిరుద్యోగం, అవినీతి, భూమి హక్కులు, సామాజిక న్యాయం వంటి సమస్యలు ప్రబలంగా మారాయి. ఈరోజు మీరు ఓటు వేసేటప్పుడు, ఇవిఎం బటన్‌ నొక్కేటప్పుడు ఈ దశాబ్దం బిజెపి ప్రభుత్వ మోసంలో ఎలా పోగొట్టుకుందో ఆలోచించండి అని ఖర్గే ట్వీట్‌లో పేర్కొన్నారు.

Spread the love