హస్తం గుర్తు పై  ఓటు వేయండి..  అందరికీ అండగా ఉండే బాధ్యత నాది..

– కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం…
– బీజేపీ, బీఆర్ఎస్ మాయమాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు..
– భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ , మునుగోడు ఎమ్మెల్యే కోబర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి…
నవతెలంగాణ- మునుగోడు
కాంగ్రెస్ భువనగిరి  పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించేందుకు హస్తం గుర్తుపై ఓటు వేయండి నియోజకవర్గంలోని ప్రజలందరికీ అండగా ఉండి ఆదుకునే బాధ్యత నాది అని భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీర్పు మాదిరిగా దేశంలో కూడా బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తేవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పాలించాయని మండిపడ్డారు . పేద ప్రజల సంక్షేమం సబండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని  అన్నారు . బీజేపీ టీఆర్ఎస్ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు చేయి గుర్తుపై ఓటు వేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస నేత, డిసిసిబి డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మాజీ మండల అధ్యక్షుడు పాల్వాయి జూనియర్ గోవర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మేకల ప్రమోద్ రెడ్డి , పాల్వాయి జితేందర్ రెడ్డి, పందుల భాస్కర్, జిట్టగొని సైదులు , కాటం వెంకన్న తదితరులు ఉన్నారు.
Spread the love