ఓటర్ నమోదు జాబితా పారదర్శకంగా ఉండాలి: డి ఎస్ వెంకన్న అడిషనల్ కలెక్టర్.

నవతెలంగాణ – గోవిందరావుపేట

ఓటరు నమోదు ఓటర్ లోని తప్పొప్పుల సవరణ మొత్తం మీద జాబితా పారదర్శకంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ డి ఎస్ వెంకన్న అన్నారు. ఆదివారం మండలంలోని పలు పోలింగ్ బూత్ లెవెల్ అధికారుల పనితీరు కేంద్రాలను పర్సనల్ కలెక్టర్ స్థానిక తహసిల్దార్ అల్లం రాజకుమార్ తో కలిసి పరిశీలించారు. మండలంలోని పసర గ్రామం పోలింగ్ బూత్ 69, 75 ల లో బూతు లెవల్ అధికారుల పనితీరు ను చూసి అభినందించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును కలిగి ఉండాలని అందుకు బూతు లెవల్ అధికారులు సర్వే ద్వారా వారిని గుర్తించి ఓటరుగా చేర్పించాలని అన్నారు. పనితీరుకు సంబంధించిన పలు సలహాలు సూచనలను అధికారులకు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులతో పాటు బూతు అధికారులు పాల్గొన్నారు.
Spread the love