నిబంధనల మేరకు ఓటర్ నమోదు చేయాలి 

– తహసిల్దార్ నల్లా వెంకట్ రెడ్డి 

నవతెలంగాణ-బెజ్జంకి 
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఓటర్ నమోదు చేయాలని తహసిల్దార్ నల్లా వెంకట్ రెడ్డి బీఎల్ఓలకు సూచించారు.బుధవారం మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ సమావేశ కార్యలయంలో మండలంలోని అయా గ్రామాల బీఎల్ఓలకు ఓటర్ నమోదు ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,వినియోగించే ఫారంలపై తహసిల్దార్ వెంకట్ రెడ్డి అవగాహన కల్పించారు.నాయిభ్ తహసిల్దార్ పార్థసారథి,ఆర్ఐ రాజయ్య,సీనియర్ అసిస్టెంట్ సుజాత,బీఎల్ఓలు హజరయ్యారు.
Spread the love