– జిల్లాలో జెండర్ పిడబ్ల్యుడి ఓటర్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి
– ఓటరు జాబితా పరిశీలకురాలు రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొగ్తు
నవతెలంగాణ-నర్సాపూర్
స్విప్ కార్యక్రమంలో భాగంగా బొట్టు పెట్టు కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలని ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చొగ్తు అన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మంగళవారం నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో ఓటర్ నమోదు కేంద్రాన్ని సందర్శించి ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకటి అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లకు పోస్టల్ ద్వారా కార్డు అందుతుందన్నారు. జెండర్ రేషియో ప్రకారం మహిళా ఓటర్ నమోదు కచ్చితంగా చేయాలన్నారు. జెండర్ రేషియో సి డబ్ల్యూ డి ఓటర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్విఫ్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ పరిధిలో బీఎల్‌వోలు ఇంటింటికి తిరిగి కొత్తగా ఓటర్ నమోదును వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఓటర్ల జాబితా పరిశీలకురాలుగా , రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా క్రిస్టినా జెడ్ చొగ్తును ఎన్నికల కమిషన్ నియమించిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఓటర్ జాబితాను పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించినట్టు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఆర్డిఓ శ్రీనివాసులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, తహసీల్దార్ కమలాద్రి, సీఐ షేక్ లాల్ మదర్, రెడ్డిపల్లి సర్పంచ్ వెంకటేష్ గౌడ్, అంగన్వాడి టీచర్లు గ్రామస్తులు ఉన్నారు.