అరాచక పాలనను ఓడించిన ఓటర్లు

– కాంగ్రెస్‌ అభ్యర్థి యెన్నంకు భారీ మెజార్టీ
మహబూబ్‌ నగర్‌: ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన పది సంవత్సరాల పాలనలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అభివద్ధి ముసుగులో అన్నదమ్ములు చేసిన అరాచక పాలనను ప్రజలు ఓట్ల రూపంలో ఓడించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం పరీక్ష విభాగంలో జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరి గింది. మూడు నియోజకవర్గాలలో 20 రౌండ్లు లో అధికారులు ఓట్లను లెక్కించారు. మూడంచల భద్రతతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు కట్టుది ప్తమైన భద్రత కల్పించారు. అధికార పార్టీ కోట్ల రూపా యలు ఎన్నికల లో ఖర్చు చేసి ప్రజలను ప్రలోభాలకు గురిచేసి గెలవాలని కొట్టను ఓటర్లు భగం చేశారు. నవంబర్‌ 30వ తేదీన జరిగిన ఓట్ల హౌల్డింగ్‌ తర్వాత అధికార పార్టీ మంత్రి తన ఫామ్‌ హౌస్‌ లో బూత్‌ల వారీగా సమీక్షించి 30 వేల మెజార్టీతో గెలుస్తున్నామని ప్రకటిచారు. దీంతో పట్టణ నియోజకవర్గ ఓటర్‌ మరోసారి అరాచక పాలన తప్పదేమన భయభ్రాతులకు గురయ్యారు. ఆదివారం వెలువడిన ఫలితాలలో 10 రౌండ్లో పూర్తికా గాని ఎనిమిది వేల మెజార్టీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి చూసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కు 68489, బిజెపి అభ్యర్థికి 19919, బీఎస్పీ, డీఎస్పీ అభ్యర్థికి 1317 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులకు అందరికీ కలిపి 3, 463 ఓట్లు వచ్చాయి. జడ్చర్ల నియోజకవర్గంలో ఎలాటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి మాజీ మంత్రి సీని యర్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై 14 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. దేవరకద్ర నియోజకవర్గం జరిగిన ఓట్ల కౌంటింగ్‌లు చివరకు కాంగ్రెస్‌ అభ్యర్థి పార్టీ జిల్లా అధ్యక్షులు జి మధుసూదన్‌ రెడ్డి 524 ఓట్లతో గెలుపొందారు. మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాయి.

Spread the love