నవతెలంగాణ – నూతనకల్
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నిర్వహించే పోలింగ్ కేంద్రం (170)ని గ్రామపంచాయతీ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి గదికి పోలింగ్ కేంద్రాన్ని మార్చినట్లు తహసిల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ కేంద్రములో మార్పు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనల ద్వారా ఎలక్షన్ కమిషన్ చే ఆమోదించబడి మార్చబడినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని పోలింగ్ కేంద్రంలోని ఓటర్లందరూ గమనించాలని కోరారు.