నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంలోని బ్రహ్మంగారి మందిరంలో వ్యాస పౌర్ణమి వేద వ్యాస మహర్షి జన్మదినం సందర్భంగా అభ్యుదయ గ్రామీణ వికాస సంఘం ఆధ్వర్యంలో కాలజ్ఞాన రచయిత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పూజించి గురుపౌర్ణమిను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో దొండి నరేంద్ర శేఖర్, గంజి సాయన్న, నాంపల్లి వసంత్, జీడిపల్లి రాజారెడ్డి మేక లక్ష్మణ్, సూరిబాబు, పుట్ట శ్రీనివాస్ గౌడ్, బుడ్డ సంజీవరెడ్డి, శేఖర్, అల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.