న్యూఢిల్లీ : దేశీయ టెక్నలాజీ కంపెనీ విఎ టెక్ వబాగ్ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3.92 శాతం వృద్థితో రూ.926.86 కోట్ల నికర అమ్మకాలు సాధించింది. 2022 ఇదే త్రైమాసికంలో రూ. 891.86 కోట్ల విక్రయాలు చేసింది. కాగా.. ఇదే సమయంలో రూ.46.07 కోట్లుగా ఉన్న లాభాలు.. గడిచిన త్రైమాసికంలో రూ.110.10 కోట్ల నష్టాలు చవి చూసింది. శుక్రవారం ఎన్‌ఎస్‌ఇలో విఎ టెక్ వబాగ్ షేర్ 1.21 శాతం తగ్గి రూ.421.40 వద్ద ముగిసింది. గడిచిన ఆరు మాసాల్లో ఈ సూచీ 39 శాతం పెరిగింది.