అరుదైన వ్యాధి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

A rare disease.. waiting for the helpనవతెలంగాణ – గాంధారి
మండల కేంద్రానికి చెందిన బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. గాంధారి గ్రామానికి చెందిన బెజుగం శ్రేయాన్ (11) s/o ప్రసాద్ గత మూడు నెలలుగా  ప్రపంచంలోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం  రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్ నందు చికిత్స తీసుకుంటున్నాడు. ఆ వ్యాధి పేరు గులియన్ భారీ సిండ్రోమ్. ఈ  అబ్బాయికి తల్లిదండ్రులు ఉన్న ఆస్తిమొత్తం అమ్మి, చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో ఆపన్నహస్తంకోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి చికిత్స కోసం ఆర్ధికసాయం చేయాలని, అలాగే ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
Spread the love