నవతెలంగాణ-వీణవంక
యువత వివేకానందుడు అడుగుజాడల్లో నడవాలని ఎంపీడీవో శ్రీనివాస్, చల్లూరు సర్పంచ్ పొదిల జ్యోతిరమేష్ అన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో వివేకానందుడి జయంతి ఉత్సవాలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి చిత్రపటానిక పూలమాల వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వివేకానందుడు యువతకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, నాయకులు పెద్దిమల్లారెడ్డి, సీహెచ్ నర్సింహారాజు, ఎనగంటి శ్రీనివాస్, వార్డు సభ్యులు అబ్ధుల్ అఖిల్ పాషా, అంగన్ వాడీ సూపర్ వైజర్ శశికిరణ్మయి, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.