అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల వాకౌట్..

నవతెలంగాణ – అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ తరుణంలోనే మొదటగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం అయింది. అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ అయ్యారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. గవర్నర్‌ వెళ్లేదారిలో బైఠాయించే ప్రయత్నం చేసారూ టీడీపీ సభ్యులు. ఈ తరుణంలోనే టీడీపీ సభ్యులను మార్షల్స్..అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీఛార్జ్ చేస్తారా అంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

Spread the love