
మండల కేంద్రంలో ఈ నెల 27 న వరంగల్ లో జరగబోయే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ పలుచోట్ల గోడలపై రాస్తున్న వాల్ రైటింగ్ వద్ద కాసేపు ఆగి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గోడలపై రంగురంగుల కలర్లతో వాల్ రైటింగ్ ను చూసి పెయింటర్ ను అభినందించారు. పెయింటర్ చేతుల నుండి బ్రష్ తీసుకొని కొద్దిసేపు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా వాల్ రైటింగ్ రాశారు. వాల్ రేటింగ్ వద్ద నిలబడి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభకు నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళ్తామన్నారు. సభకు స్వచ్ఛదంగా తరలి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.ఉద్యమ పథాన ఉరిమిన చరిత..స్వరాష్ట్ర ప్రగతిలో చెరపలేని ఘనత బిఆర్ఎస్ పార్టీది అన్నారు. రాబోవు తరానికి బీఆర్ఎస్సే భవిత అని 25 ఏండ్ల పండగకు మనమంతా కదలాలని పిలుపునిచ్చారు.స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేసి సంక్షేమ పాలనను అందించిన మన ఇంటి పార్టీకి ఏప్రిల్ 27న రజతోత్సవం అని, బహిరంగ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు.