– పేరుకే మోడల్ కాలనీ..
– కాలనీని కన్నెత్తి చూడని అధికారులు,నాయకులు, ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ – ధర్మసాగర్
ధర్మసాగర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 14 వార్డు సభ్యులు,3 ఎంపీటీసీలకు సంబంధించిన ఓటర్లు మాడల్ కాలంలో ఉండడంతో,ఆ కాలనీకి వార్డు సభ్యుడు బాధ్యులు అనేవాళ్ళు లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేక పోతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ కాలనీ,మోడల్ కాలనీ వాసులందరూ ఒక వార్డుగా చేయాలని స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను,పంచాయతీ సెక్రెటరీలను కోరినప్పటికీ సమస్యను పరిష్కారం చేయకుండా ఒకరి మీద ఒకరితో కాలయాపన చేస్తున్నారని కాలనీవాసులు వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని రెండు కాలనీవాసులు ముక్తకంఠంతో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.పేరుకే మాత్రమే మాడల్ కాలనీ,కాలనీని కన్నెత్తి చూడని అధికారులు, ప్రజా ప్రతినిధులు,నాయకులు దీంతో అభివృద్ధికి నేర్చుకోలేక ఆమెడ దూరంలో మోడల్ కాలనీ ఉన్నదని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని ప్రజలు కనీస అవసరాల కోసం కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రహదారిని చేరుకోవడానికి వారు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
అదే రీతిలో వాణిజ్య వర్తకుల వాహనాలు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండడంతో వారు వెనకాడుతున్నారని కాలనీ వాసుల గూడు వినే నాథులు లేరని కాలినివాసులు తీవ్రంగా మనోవేదనలకు గురవుతూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దిన్నర కాలంలో మాడల్ కాలనీలో 360 ప్లాట్లల్లో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్నా మూడు దఫాల సర్పంచులు, వార్డు సభ్యులు ఎంపీటీసీలు ఎన్నికైనప్పటికీ ఈ కాలనీ రూపు రేఖలు మారలేదనీ,దానికి బలమైన కారణం గ్రామంలో ఉన్న 14 వార్డులు మూడు ప్రాదేశిక ఎంపీటీసీల ఓట్లు అన్నీ మిళితమై ఉండడం వల్లనే ఈ కాలనీ ని ఏ ఎంపీటీసీ ఏ వార్డు సభ్యులు సర్పంచ్లు పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పకనే చెప్పవచ్చు. కాలనీకి కావాల్సిన మౌలిక వసతులను పరిష్కారానికి ఏ ప్రజాప్రతినిధి అధికారులు ముందు రాకపోవడంతో ఈసారి జరగబోయే సర్పంచి ఎన్నికలను బహిష్కరించేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని తెలుస్తుంది.ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య చొరవతో మోడల్ కాలనీ ఒక వార్డుగా నిర్ణయిస్తే వార్డుకు సంబంధించిన వార్డు సభ్యున్ని అడిగేందుకు అవకాశం ఉంటుందని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేయాలని కాలనీ వాసులు వారిని కోరుతున్నారు.లేనిపక్షంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.
1. ఇసంపల్లి సురేఖ: నిత్యవసర వస్తువులు కూరగాయలు మంచినీళ్లు తీసుకురావడానికి రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉంది. చినుకు పడితే కాలనీ మొత్తం చిత్తడిగా మారుతుంది. సరియైన మోరీలు లేక వర్షపు నీరుతో చుట్టుపక్కల వాళ్ళుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తే బాగుంటుంది.
2. జనగాని సరోజన: కాలనీని పట్టించుకునే నాధుడు లేక పరిసర ప్రాంతాలు నిత్యం చెత్తాచెదారంతో పేరుకుపోయి ఉంటుంది.సరియైన ప్రజా ప్రతినిధి బాధ్యులుగా ఇస్తే వారిని అడిగేందుకు వీలుంటుంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి.
3. మూల సావిత్రి. కాలనీకి దారి లేక స్కూల్ పిల్లల బస్సు,ఆటోల రాకపోకులకు తీవ్రంగా ఇబ్బందికరంగా ఉంది. కాలనీలో మోరీలు లేక ఎక్కడ నీరు అక్కడే నీరు నిలిచి ఈగలు దోమలతో రోగాల బారిన పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. వృద్ధులను బయటికి తీసుకెళ్దాం అంటే భయం భయంగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం అధికారులు సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.