– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాల నే ఆలోచనతో ఏర్పాటు చేస్తున్న వార్డు ఆఫీసులను నేటి నుంచి ప్రారభించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్‌పేటలో 10, సనత్‌నగర్‌లో 18 చిరు వ్యాపారుల కోసం నిర్మించిన షాపులను మంత్రి ప్రారం భించి మాట్లాడారు. చిరు వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచు కుని ఈ షాపులను నిర్మించినట్టు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఈ వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంటారనీ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదనీ, వార్డు ఆఫీసులోనే ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఈ విధమైన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రజలు ఈ వార్డు ఆఫీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో రూ.వందల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల దీర్ఘకాలిక సమస్యలను కూడా చాలా వరకు పరి ష్కరించినట్టు తెలిపారు నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఎర్రగడ్డ నుంచి ఫతేనగర్ ప్లై ఓవర్ వరకు ఉన్న రహదారి విస్తరణ చేసి దివైడర్‌ల నిర్మాణం చేయడంతో వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించినట్టు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, మోహన్ రెడ్డి, ఇందిర, వాటర్ వర్క్స్ హరిశంకర్, డివిజన్ అద్యక్షులు హన్మంతరావు, కొలన్ బాల్ రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, నర్సింహ, సరాప్ సంతోష్, సురేందర్ సింగ్, ఖలీల్, కరీం, పాజల్, రాజేష్, గో దాస్ కిరణ్, లలితా చౌహాన్, పుష్పలత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.