– గత కొన్నేళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరు గులాబీ నేతలు ఒక్కటయ్యారా..?
– అసంబ్లీ ఎన్నికల వేడుకల సందర్భంగా విభేదాలు మరిచారా?
– ఇరు నేతల మధ్య కోల్డ్ వార్ ముగిసినట్లేనా ? అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా వీరి రాజకీయాలు నడుస్తున్నాయా..?
– ఎవరా పొలిటీషియన్స్, ఏంటా సయోద్య
నవతెలంగాణ -పెద్దవూర:
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయిన ఎం సీ కోటిరెడ్డి, నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎం ఏల్ ఏ నోముల భగత్ మధ్య గత రెండేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇన్నాళ్లూ ఎడమొహం, పెడమొహంగా వుంటూ ఒకరి కొకరు సహకారం అందించు కోకుండా వైశమ్యాలతో సభలు, సమావేశాలు నిర్వహించు కుంటూ వస్తున్నారు. దీంతో భగత్ వర్గం కోటిరెడ్డి వర్గం ఒకరికొకరు ఎవరికీ వారే యమునా తీరే అన్నట్ల గా వ్యవహారిస్తున్నారు. సాగర్లో ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందా అంటే అది నిజం కాదని తెలుస్తుంది. కేటీఆర్ క్లాస్ తో ఆ ఇద్దరు నేతలు కలిసినట్టేనా అంటే దీనిపై నాగార్జున సాగర్ లో ఆసక్తి కర చర్చ జరుగుతుంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు మొన్నటి వరకు సై అంటే సై అన్నారు ఆ ఇద్దరు నేతలు. మాటలు కరువైన నేతలిద్దరు కెటీఆర్ కి తామే రెండు కళ్లమని చెప్పుకుంటున్నారు. ఒకే వేదికను పంచుకుంటున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న ఈ ఇద్దరి నేతల వైరం కేటీఆర్ క్లాస్ తో కొలిక్కి వచ్చిందా అంటే అది నిజమే అనుకుంటున్నారు ప్రజలు
– నోముల భగత్ కంటే ముందు
నోముల బగత్ కంటే ముందే ఎం సీ కోటిరెడ్డి రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత కాంగ్రెస్ పార్టీకి నుంచి అప్పటి ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ లో చేరారు.2018 ఎన్నికల్లో ఎం ఏల్ ఏ గా సీటు సాధించు కోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అయిటే అప్పట్లో నోముల నరసింహమ్మయ్యకు అధిష్టానం సాగర్ సీటు కేటాయించింది. అయితే అప్పటినుంచి ఆయన వర్గీయలు నామమాత్రంగా ఉండడం, ప్రచారం లో పాల్గొనక పోవడం, ఎప్పుడు రాజకీయంగా ఒకరి కొకరు ఎదురు పడక పోవడం తో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎంసీ కోటిరెడ్డిని పిలిపించు కోని ఎంఏల్ సీ ఇస్తామని చెప్పారు. అప్పటినుంచి ఆ ఇద్దరు కలిసి పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిన ఇద్దరు నేతలు ఒకే వేదికలో, ఒకే రాజకీయ పార్టీలో తమ ప్రయాణాన్ని ప్రారంబించారు. ఆ ఎన్నికల్లో నోముల నరసింహమ్మాయ్య గెలుపుకు కోటిరెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందజేశారు. ఆ తరువాత అనుకున్నట్లు గానే 2021 లో కోటిరెడ్డి కి ఎంఏల్ సీ ఇచ్చింది.
– సాగర్ ఉప ఎన్నికల్లో
2021 లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో భగత్ కు, కోటిరెడ్డికి మధ్య కొంత కాలం విభేదాలు, వర్గాపోరు తారాస్తాయికి చేరుకుంది. నియోజకవర్గం లో ఏ మండలం లో, ఏ గ్రామం లో సూసిన భగత్, కోటిరెడ్డివర్గాల పోరు నువ్వా నేనా అన్నట్లు గా వుంది. అప్పటి నుంచి తగ్గేదే లేదంటూ కోటిరెడ్డి వర్గం వేరుగా మారింది. సభలు, సమావేషాలు, పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా చేపట్టారు. దశాబ్ది ఉత్సవాలలోకూడా వేరువేరుగా కార్యక్రమంలో పాల్గొన్నారు.2023 లో మళ్ళీ భగత్ కు సీటు కేటాయించడంతో అయన అసమ్మతి వాదులు పెద్దవూర, తిరుమల గిరి సాగర్, గుర్రంపూడ్, నిడమానూరు, త్రిపురారం, అనుముల మండలాలలో కోటిరెడ్డి వర్గం సర్పంచులు,
ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, నాయకులు కార్యకర్తలు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చేరికలు ఎక్కువగా వుండడం తో ఇక లాభం లేదని నియోజకవర్గం లో కాంగ్రెస్ లో చేరని బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటిసిలు, ప్రదాన కార్యకర్తలను, ఎంసీ కోటిరెడ్డిని, రామచందర్ నాయక్ ను అధిష్టానం హైదరాబాద్ పిలిపించుకొని నియోజకవర్గం ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించింది.
– కాంగ్రెస్ లోకి వలసలు
ఆతరువాత నాగార్జున సాగర్ నియోజకవర్గం లో మలిగిరెడ్డి లింగారెడ్డి, గాలి రవికుమార్, సాగర్ తిరుమలగిరి, పెద్దవూర, గుర్రంపూడ్, త్రిపురారం, అనుముల మండలాలలో భారీ సంఖ్యలో సర్పంచులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. అయితే వలసలు ఆగిపోతాయని అలోచించి కోటిరెడ్డికి ఇంచార్జి అప్పగించారు. కానీ వలసల పరంపర కొనసాగుతూనే వుంది. అప్పట్లో భగత్ కు ఎంసీ కోటిరెడ్డి కి కొంత కాలం ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నా ఇప్పుడు మాత్రం.. ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. ప్రచార సమయం లో గతంలో ఎన్నడూ లేని విదంగా ఇద్దరూ ఒకే టేబుల్ పై కూర్చొని భోజనం చేయడం, అల్పాహారం తినడం వంటివి చేస్తుండడం తో మళ్ళీ ఆ ఇద్దరు ఒక్కటయ్యారని కలిసి ప్రచారం నిరహిస్తున్నారని వర్గాపోరు సమసి పోయిందని ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్నికలలో గులాబీ అభ్యర్ధిని భగత్ ఎలాగైనా గెలిపించు కొని అధిష్టానం వద్ద మార్కులు కొట్టాలని కోటిరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో బాగాంగగానే ఇద్దరూ కలిసి తిరగడం, ప్రచారం చేయడం, పార్టీలో చేర్చుకోవడం వంటివి జరుగుతున్నాయని ప్రజలు చర్చించు కుంటున్నారు. అయినా కాంగ్రెస్ లోకి వలసలు పరంపర కొనసా గుతూనే వున్నాయి.
– సాగర్లో మునిసీ పాలిటీలో
సాగర్ మున్సిపాలిటీలో ఎం ఏల్ సీ వర్గం కౌన్సిలర్లు 07 గురు ఉన్నారు. వీరికి మున్సిపాలిటీలో తగిన ప్రాదాన్యత ఇవ్వడం లేదని వీరంతా కాంగ్రెస్ పార్టీ లోకి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం తెలుసుకొని గత కొద్దీ రోజుల క్రితం నాగార్జున సాగర్ విజయ్ విహార్ లో కౌన్సిలర్ల కు కోటిరెడ్డి క్లాస్ తీసుకున్నారు. దాంతో అందులో ఇమడలేక, పార్టీ మారలేక సంధిగ్ధం లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సాగర్లో గులాబీ జెండా ఎగరడం కష్టాంగానే కనిపిస్తుంది. ఆరు డిక్ల రేషన్ లతో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంటే బీఆర్ఎస్ మాత్రం వర్గపోరుతోనే సరిపుచుకుంటుందని చర్చ జరుగుతుంది. దీంతో ఈసారి సాగర్ ఎన్నికల్లో ప్రజలు ఎవరికీ తీర్పు నిస్తారో, కౌంటింగ్ వరకు ఎదురు చూడాల్సిందే మరీ..!