హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది

నవతెలంగాణహైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ట్యాంక్‌ బండ్‌, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను హెచ్‌ఎండీఏ అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు గణేష్ నిమజ్జనం ఇవాళ కూడా పీవీ మార్గ్‌లో కొనసాగుతోంది. క్రేన్ల సాయంతో వ్యర్థాలను, ఇనుప చువ్వలను తొలగిస్తూ ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. పూలు, సామగ్రి, ఇతర చెత్తా చెదారం, కాగితాలు సైతం జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు తొలగింపు ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 20 నుంచి 30 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు.

Spread the love