నవతెలంగాణ- రెంజల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం జలకలతో ఉట్టిపడుతుంది. గురువారం కందకుర్తి గోదావరి లని త్రివేణి సంగం వద్ద భారీ వరద నీరు రావడంతో జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో పెద్ద మొత్తంలో కొత్త నీరు రావడంతో కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం జలకల ఉట్టి పడుతుంది. కందకుర్తి గోదావరి లోని రాతి శివాలయం సగం వరకు నీరు వచ్చింది.