
– రైతుల తరఫున అధికారులకు లేఖ
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గం లోని కప్పల వాగు, పెద్దవాగు పరివాహక ప్రాంత రైతుల కోరిక మేరకు ప్యాకేజ్ 2 1 ద్వారా మెంట్రాజ్ పల్లి పంపు హౌజ్ నుండి వదలాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఫోన్ లో కోరారు. సోమవారం ఆయన ఈ విషయమై సీఈ మధుసూదన్ రావు, ఈఈ భాను ప్రకాష్ లతో ఫోన్ మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి పెద్దవాగు లోని చింతలూర్ అవుట్ లెట్, కప్పుల వాగు లోని బడా భీంగల్ అవుట్ లెట్ పాయింట్ల నుండి పెద్దవాగు కప్పుల వాగులో నీళ్లు వదలాలన్నారు.రోజు రెండు వాగులలో 300 క్యూసెక్కుల చొప్పున ఈ నెల 21 నుండి 10 రోజుల పాటు నీళ్లు వదిలి కప్పల వాగు, పెద్దవాగు లు నింపాలని సూచించారు. రెండు వాగులను నింపినట్లైతే ఈ వాగులకు ఇరువైపులా ఉన్న బోర్లలో నీళ్లు చేరి వాగు పరివాహక రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు.వెంటనే నీళ్లు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు.ఈ సందర్భంగా రైతుల తరపున నీళ్లు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ అధికారులకు లేఖ రాశారు.