నీలం మధు వెంటే మేమంతా…

– రోజు రోజుకు బలపడుతున్న బీసీ వాదం..
– పూర్తి మద్దతు ప్రకటించిన పటాన్ చెరు మండలం రామేశ్వరం బండ,గుమ్మడిదల గ్రామాలకు చెందిన సబ్బండ వర్గాలు…
– పటాన్ చెరుఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని డిమాండ్..
– పార్టీలకతీతంగా గెలిపిస్తామని ధీమా…
న‌వ‌తెలంగాణ – పటాన్ చెరు
బహుజన నాయకుడు బీసీ బిడ్డ నీలం మధు వెంటే మేమంతా ఉంటామంటూ గ్రామాలలోని సబ్బండ వర్గాలు ముందుకు వస్తున్నాయి. సామాజిక న్యాయం నినాదంతో అన్ని సబ్బండవర్గాలు ఏకమవుతున్నాయి. గత నాలుగు ఏళ్లుగా అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు సేవలు పటాన్ చెరు నియోజకవర్గానికి అవసరమని గుర్తు చేస్తున్నారు. పార్టీల టికెట్లను పక్కనపెట్టి ఈసారి సబ్బండ వర్గాల తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిందే అంటూ ఘంటాపథంగా కోరుతున్నారు. నియోజకవర్గంలో నుంచి వివిధ గ్రామాల నుంచి తరలివస్తున్న సబ్బండ వర్గాల ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు. నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా పటాన్ చెరు మండలం రామేశ్వరశీబండ, గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామ ప్రజలు కదిలారు. అన్ని కుల సంఘాలకు సంబంధించిన గ్రామస్తులు నీలం మదును కలిసి తమ మద్దతును తెలిపారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గానైనా పోటీ చేయాలని కోరారు. పార్టీలకతీతంగా నీలం మధు ముదిరాజ్ కి మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తన మీద ఉన్న ప్రేమాభిమానాలతో తనకు ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ప్రకటించిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా బీసీ సబండవర్గాల ప్రజలు ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. ఖచ్చితంగా మీ అందరితో చర్చించి పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా భరీలో ఉంటానని త్వరలో తన కార్యచరణను ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల నాయకులు డి, నర్సింలు, మత్స శాఖా అధ్యక్షులు కె,ఆంజనేయులు, ధనంజయ్, యాదకిషన్, పాండు, కృష్ణ, పోచయ్య, సుభాష్, శ్రీశైలం, నాగయ్య, రామేశ్వరంబండ నాయకులు మన్నే ఆంజనేయులు, సురేష్, బిక్షపతి, గడ్డమీద రవి, ప్రవీణ్, విష్ణు, జనార్ధన్, నాగరాజు, హరీష్ గౌడ్, శ్రీనివాస్, అశోక్, మహేష్, శివ శంకర్, గోవర్ధన్, దినేష్, విక్రమ్ గౌడ్, నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love