జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశాం: భుజంగరావు

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశామని కీలక నిందితుడు, అడిషనల్ ఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు వెల్లడించారు. అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేసేందుకు ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లను తెలుసుకునే వాళ్లమని తెలిపారు. ప్రభుత్వ, బీఆర్ఎస్ నేతల కేసులను పర్యవేక్షిస్తున్న లాయర్లతో పాటు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశామని వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Spread the love