సమ్మెను విరమించుకుంటున్నాం..

– అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మక్క
నవతెలంగాణ- తాడ్వాయి
దాదాపు 20 రోజుల పాటు కొనసాగించిన సమ్మెను నేటితో విరమించుకున్నట్లు, గురువారం నుండి యధావిధిగా విధుల్లోకి వెళ్తున్నట్లు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురేందుల సమ్మక్క తెలిపారు. ఇన్ని రోజులు చేసిన సమ్మె జీతం ఇస్తున్నట్లు ప్రకటించారు. టీచర్కు రెండు లక్షలు హెల్పర్ కు ఒక లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్ తో పాటు, మధ్యంతర భృతి(ఐఆర్) అంగన్వాడీలకు వర్తిస్తుందని ప్రకటించారు అని, బీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు సత్యవతి రాథోడ్ తో జరిగిన చర్చలు సఫలం కావడంతో విరమించుకుంటున్నట్లు తెలిపారు.
Spread the love