బ్లాక్‌బస్టర్‌ ఖాయమనే నమ్మకంతో ఉన్నాం

We are confident that it will be a blockbuster”సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో వెంకటేష్‌తో ఒక డిఫరెంట్‌ జోనర్‌ ట్రై చేశాను. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు క్రైమ్‌ రెస్క్యూ ఎడ్వంచర్‌లా ఉంటుంది. సెకండ్‌ హాఫ్‌ డిఫరెంట్‌ జోనర్‌లో ఉంటుంది. వెంకీతో యాక్షన్‌ సినిమా చేసినా కూడా వినోదానికే పెద్దపీట వేస్తాను. ఆయనతో ఆ ఎంటర్‌టైన్మెంట్‌ చేయటం నాకు చాలా ఇష్టం’ అని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు.
వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ కాంబోలో వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర. ప్రతి ఫ్యామిలీ రిలేట్‌ చేసుకునే సినిమా ఇది. అద్భుతమైన సాంగ్స్‌ ఉన్నాయి. ట్రైలర్‌లో ఫన్‌ మూమెంట్స్‌ అలరించాయి. సినిమాలో చూడటానికి ఎంగేజింగ్‌ కంటెంట్‌ ఉందని ఫిక్స్‌ అయ్యారు. థియేటర్స్‌కి వచ్చాక అద్భుతంగా నచ్చితే సినిమా బ్లాక్‌ బస్టర్‌. సినిమాకి వచ్చిన ఆడియన్స్‌ హ్యాపీగా నవ్వుకుని వెళ్తారు.
– ‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వెంకీతో నా బాండింగ్‌ డబుల్‌ అయ్యింది. ఈ సినిమాతో బెస్ట్‌ బడ్డీస్‌ అయిపోయాం. చాలా క్లోజ్‌ అయ్యాం. ఆయనకి బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌ సాంగ్‌ చాలా నచ్చేసింది. ఆయనే స్వయంగా పాడతానని చెప్పారు. నేను షాక్‌ అయ్యాను. అదే టైమింగ్‌లో ఓ రీల్‌ చేశాం. వెంకటేష్‌ 20 నిమిషాల్లో ఆ పాట పాడేశారు.
భీమ్స్‌ ఇచ్చిన ‘గోదారి గట్టు..’ ట్యూన్‌ వినగానే ఒక పెక్యులర్‌ వాయిస్‌తో పాడిస్తే బావుం టుందని అనుకుని, రమణ గోగులని ఫస్ట్‌ ఆప్షన్‌గా ఎంచు కున్నాం. భీమ్స్‌ ఆయన్ని సంప్రదించి పాడించారు. ఈ క్రెడిట్‌ భీమ్స్‌కి దక్కుతుంది. రమణ గోగుల కూడా తన మార్క్‌ని యాడ్‌ చేశారు. హిట్‌ సాంగ్‌ అనుకున్న పాట కాస్త ఈ రోజు గ్లోబల్‌ సాంగ్‌ అయ్యింది.
ఇందులో భాగ్యం క్యారెక్టర్‌ చాలా స్పెషల్‌. వెరీ ఎడ్జ్‌లో నడిచేది. చాలా కేర్‌ తీసుకొని చేయాల్సిన క్యారెక్టర్‌. ఐశ్వర్య బెస్ట్‌ పెర్ఫార్మర్‌. అయితే తను గోదారి యాస ఎలా పలుకుతుంది?, ఆ క్యారెక్టర్‌లో తన బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చిన్న ఆడ షన్‌లా చేశాం. భాగ్యం చాలా మంచి క్యారెక్టర్‌. ఐశ్వర్యకి మంచి పేరు వస్తుంది. మీనాక్షి కూడా చాలా క్రమశిక్షణ గల నటి. తనకి మంచి టైం సెన్స్‌ ఉంది. చాలా చక్కగా పెర్ఫార్మ్‌ చేసింది. ఇద్దరూ ఆదరగొట్టారు.
దిల్‌ రాజు బ్యానర్‌లోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి కారణం ఒకటే.. మంచి అండర్‌స్టాండింగ్‌. ఆయనతో నాకు ‘పటాస్‌’ సినిమాతో ట్రావెల్‌ ఉంది. నాకు ఎవరైనా కనెక్ట్‌ అయితే వాళ్ళతోనే ట్రావెల్‌ చేయడానికి ఇష్టపడతాను. దిల్‌ రాజు, శిరీష్‌ అంటే నాకు ఫ్యామిలీ. అల్మోస్ట్‌ పదేళ్ళ జర్నీ మాది.
ఫైనల్‌ కాపీ చూసిన తర్వాత వెరీ హ్యాపీ. వెంకీతో ‘ఎఫ్‌2, ఎఫ్‌3’ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పబ్లిక్‌ కూడా మేం హిట్‌ కొట్టేస్తామని కాన్ఫిడెంట్‌గా ఉండటం ఇంకా హ్యాపీ. ఎఫ్‌4 డెఫినెట్‌గా ఉంటుంది. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ని కూడా ఫ్రాంచైజ్‌ చేసుకునే స్కోప్‌ ఉంది.

Spread the love