ఆకలి తో ఉన్నాం.. కోద్దిగా అన్నం పేట్టార..!

– అన్నం కోసం టియు విద్యార్థుల బిక్షాటన…
– అధికారుల తీరుపై ఆగ్రహం..
– యూనివర్సిటీ గేటు ఎదుట ఖాళీ ప్లేట్లతో నిరసన..
– నాలుగ వరోజు అవుట్సోర్సింగ్ సమ్మె
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా మెస్ వర్కర్లకు వేతణలు చేల్లించక పోవడంతో ఓట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు గైర్హాజరయ్యారు.వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సమయానికి ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బుధవారం హామీతో తాత్కాలికంగా సమ్మె ను విరమణ చేసిన, మరుసటి రోజు గురువారం అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందక పోవడంతో ఉదయం యూనివర్సిటీ లోని పరిపాలన భవనం వద్ద బైఠాయించి ఆందోళనకు చేపట్టారు.ఉదయం టీఫీన్ లేక, మధ్యాహ్నం భోజనం లేక ఆకలితో విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో జాతీయ రహదారి కి ఆనుకుని ఉన్న యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఎండలో బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తు వారందరూ తమ నిరసనను వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న నడిపల్లి తండా లో ఇంటింటికి తిరిగి అమ్మ ఆకలి తో ఉన్నాం కోద్దిగా అన్నం పేట్టార అని అడుక్కుంటు తమ నిరసనను తెలిపారు. అంతకుముందు యూనివర్సిటీ గెట్ ఎదుట బైఠాయించి భోజనం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు భోజనం అందెల చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
యూనివర్సిటీలో ఉన్న 650 మంది విద్యార్థులు అన్నం లేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని వారన్నారు. తక్షణమే వైస్ ఛాన్సలర్ తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఉన్న 650 మంది విద్యార్థులు అన్నం లేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని వారన్నారు. తక్షణమే వైస్ ఛాన్సలర్ తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణమే అవినీతి వీసీని బర్తరఫ్ చేసి, టీయూ ను ప్రేక్షకులను చేసి కాపాడాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. తెలంగాణ యూనివర్సిటీ లో ఔట్సోర్సింగ్ సిబ్బంది సమ్మె గురువారం నాలుగో రోజు కు చేరుకుంది.గత రోజులుగా ఔట్సోర్సింగ్ సిబ్బంది కి ప్రతి నేలా అందజేసే వేతనలు చెల్లించక పోవడంతో సిబ్బంది ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటివరకు అధికారులు ఎలాంటి స్పందన ఇవ్వక పోవడంతో సమ్మె నిర్వహిస్తున్న మని వారన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె వల్ల యూనివర్సిటీ లో ఎక్కడి చేత్త చేదరం అక్కడే ఉండి పోతుంది.ఇదే కాకుండా ప్రతి కార్యాలయం లో అటెండర్ లు సైతం విధులకు రాలేక కార్యాలయాలు బోసిపోతున్నయి. లేక ఈ సమ్మెలో అవుట్ సోర్సింగ్ ప్రెసిడెంట్ బి సురేష్ కార్యదర్శి బికోజి నాన్ టీచింగ్ సిబ్బంది తరఫున అధ్యక్షులు బి సాయ గౌడ్, అసిస్టెంట్ రిజిస్టర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం కు బదులు 5గంటలకు..
తెలంగాణ యూనివర్సిటీలో చీఫ్ గార్డెన్ నిర్లక్ష్యం వలన మధ్యాహ్నం చేయవలసిన భోజనాన్ని సాయంత్రం 5.30 కు బయటీ నుండి ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్లు విద్యార్థులు వాపోయారు.

Spread the love