బాబుకు మేమున్నాం…

– చంద్రబాబుకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలు
– ఆదివారం ఖమ్మంలో భారీ ప్రదర్శన..
– హాజరైన నందమూరి చైతన్య కృష్ణ
బాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌ చేయడంతో అభిమానుల నైరాశ్యం
– బీజేపీతో కలిసి జగన్నాటకాలని విమర్శలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడికి మద్దతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ కేసులో బాబు అరెస్టు అక్రమమంటూ ఖమ్మంలో ఆదివారం రాత్రి నిర్వహించిన నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పార్టీలకతీతంగా నిర్వహించిన ఈ ర్యాలీలో అధికంగా టీడీపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు నందమూరి కృష్ణచైతన్య హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బాబు బెయిల్‌ కోసం పూజలు…
బాబు బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాడీవేడి వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రెండురోజులు రిజర్వ్‌ చేయడంతో బాబు అభిమానులు తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారు. టీవీలు, ఇతరత్ర ప్రసారమాధ్యామాలు, ఫోన్‌ల ద్వారా ఎప్పటికప్పుడు బాబు బెయిల్‌ గురించి తెలుసుకున్నారు. బెయిల్‌ రావాలని వేడుకుంటూ వివిధ ఆలయాల్లో పూజలు చేయించారు. చివరికి తీర్పు రిజర్వ్‌లో ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో కలిసి జగన్నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.
కదంతొక్కిన అభిమానులు…
చంద్రబాబును విడుదల చేయాలంటూ అభిమానులు ఆదివారం రాత్రి కదంతొక్కారు. టీడీపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో పాటు కమ్యూనిస్టు పార్టీలు బాబు అరెస్టును ఖండించాయి. ఎన్టీఆర్‌ కూడలి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పెవిలియన్‌గ్రౌండ్‌ వరకు ఓ గంటపాటు కొనసాగింది. చంద్రబాబు అభిమానులు చేపట్టిన ఈ ర్యాలీలో ఎన్టీఆర్‌ మనువడు చైతన్య కృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాబుతో నేను ప్లకార్డులు, నల్లజెండాలు చేబూని అభిమానులు ఈ ర్యాలీలో పాల్గన్నారు. బాబు అరెస్టును ఖండించిన వారిలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరీశ్‌, ఖమ్మం శాసనసభ నియోజకవర్గ ఇన్‌చార్జి కూరపాటి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు మిక్కిలినేని మంజులు, మేడ ప్రశాంతలక్ష్మి, కొత్తపల్లి నీరజ, సరిపూడి రమాదేవి, చిరుమామిళ్ల లక్ష్మి, మోతారపు శ్రావణి, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, నల్లమల వెంకటేశ్వర్లు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, చింతనిప్పు కృష్ణచైతన్య, మందడపు రామకృష్ణ, మందనపు సుధాకర్‌, వల్లభనేని రామారావు, నల్లమల రంజిత్‌, వైద్యులు కూరపాటి ప్రదీప్‌, డాక్టర్‌ అసాధారణ్‌, యుగేందర్‌, కంభంపాటి నారాయణరావు తదితరులు ఉన్నారు.
కక్షసాధింపు సరికాదు : చింతనిప్పు కృష్ణచైతన్య, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు
స్వర్ణాంధ్రప్రదేశ్‌ రూపకర్త, సైబరాబాద్‌ సృష్టికర్త, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టు ఆక్షేపణీయం. ఆయన్ను తక్షణం విడుదల చేయాలి. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదు. గతంలో ఇలాంటివి ఉండేవి కాదు. – చంద్రబాబుకు మద్దతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలు
– ఆదివారం ఖమ్మంలో భారీ ప్రదర్శన..
– హాజరైన నందమూరి చైతన్య కృష్ణ
– బాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌ చేయడంతో అభిమానుల నైరాశ్యం
– బీజేపీతో కలిసి జగన్నాటకాలని విమర్శలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడికి మద్దతుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ కేసులో బాబు అరెస్టు అక్రమమంటూ ఖమ్మంలో ఆదివారం రాత్రి నిర్వహించిన నిరసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పార్టీలకతీతంగా నిర్వహించిన ఈ ర్యాలీలో అధికంగా టీడీపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు నందమూరి కృష్ణచైతన్య హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బాబు బెయిల్‌ కోసం పూజలు…
బాబు బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాడీవేడి వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రెండురోజులు రిజర్వ్‌ చేయడంతో బాబు అభిమానులు తీవ్ర నైరాశ్యానికి లోనయ్యారు. టీవీలు, ఇతరత్ర ప్రసారమాధ్యామాలు, ఫోన్‌ల ద్వారా ఎప్పటికప్పుడు బాబు బెయిల్‌ గురించి తెలుసుకున్నారు. బెయిల్‌ రావాలని వేడుకుంటూ వివిధ ఆలయాల్లో పూజలు చేయించారు. చివరికి తీర్పు రిజర్వ్‌లో ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో కలిసి జగన్నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.
కదంతొక్కిన అభిమానులు…
చంద్రబాబును విడుదల చేయాలంటూ అభిమానులు ఆదివారం రాత్రి కదంతొక్కారు. టీడీపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌తో పాటు కమ్యూనిస్టు పార్టీలు బాబు అరెస్టును ఖండించాయి. ఎన్టీఆర్‌ కూడలి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పెవిలియన్‌గ్రౌండ్‌ వరకు ఓ గంటపాటు కొనసాగింది. చంద్రబాబు అభిమానులు చేపట్టిన ఈ ర్యాలీలో ఎన్టీఆర్‌ మనువడు చైతన్య కృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాబుతో నేను ప్లకార్డులు, నల్లజెండాలు చేబూని అభిమానులు ఈ ర్యాలీలో పాల్గన్నారు. బాబు అరెస్టును ఖండించిన వారిలో టీడీపీ పార్లమెంటరీ కమిటీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరీశ్‌, ఖమ్మం శాసనసభ నియోజకవర్గ ఇన్‌చార్జి కూరపాటి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు మిక్కిలినేని మంజులు, మేడ ప్రశాంతలక్ష్మి, కొత్తపల్లి నీరజ, సరిపూడి రమాదేవి, చిరుమామిళ్ల లక్ష్మి, మోతారపు శ్రావణి, నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, నల్లమల వెంకటేశ్వర్లు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, చింతనిప్పు కృష్ణచైతన్య, మందడపు రామకృష్ణ, మందనపు సుధాకర్‌, వల్లభనేని రామారావు, నల్లమల రంజిత్‌, వైద్యులు కూరపాటి ప్రదీప్‌, డాక్టర్‌ అసాధారణ్‌, యుగేందర్‌, కంభంపాటి నారాయణరావు తదితరులు ఉన్నారు.
కక్షసాధింపు సరికాదు: చింతనిప్పు కృష్ణచైతన్య, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు
స్వర్ణాంధ్రప్రదేశ్‌ రూపకర్త, సైబరాబాద్‌ సృష్టికర్త, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్టు ఆక్షేపణీయం. ఆయన్ను తక్షణం విడుదల చేయాలి. రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదు. గతంలో ఇలాంటివి ఉండేవి కాదు.

Spread the love