అక్రమ వలసదారుల పై అమెరికా అమానుషాన్ని ఖండిస్తున్నాం

– ఎండి జహంగీర్, సీసీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు. 
నవతెలంగాణ – భువనగిరి
అక్రమ వలసదారులను ఏదేశ చట్టమైన అంగీకరించదు కానీ వలస దారులను తిరిగి ఆయాదేశాలకు పంపే విధానం తీవ్ర అభ్యంతకరంగా ఉన్నదన్నారు. భారత వలస దారులను సరుకులు సరఫరా చేసే యుద్ధ విమానాల్లో కుక్కి తీసుకరావడం అమానుష మైనది అని దీన్ని ఖండిస్తున్నాం అని సీసీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. శుక్రవారం వారు సిపిఎం జిల్లా కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. అమెరికాలో వలస దారులుగా ఉన్న భారతీయులను కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి యుద్ధ ఖైదీల్లగా పంపించడం ఘోరం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధంలో పట్టుబడిన ఖైదీలను కూడా గౌరవంగా చూడాలని నిబంధనలు ఉన్నాయి, కానీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ యుద్ధ నేరస్తుల్లగా వలస వాసుల పట్ల వ్యవహరించడం ఖండిస్తున్నాము. ప్రధాని మోడీ అనుసరించిన ఆర్థిక విధానాలు, నిరుద్యోగాన్ని పెంచి పోషించడం వల్ల గత్యంతరం లేక భారత మేదోసంపత్తి వలస వెళ్తుందన్నారు. దీనికి ప్రధాన కారణం భారత నిరుద్యోగ రేటు రోజు రోజుకు పెరగటమే అని భారతీయ వలస దారులను గౌరవంగా తీసుకరావడం కోసం కేంద్ర ప్రభుత్వం భాద్యత వహించాలి అని వారు అన్నారు.
Spread the love