ప్యోంగ్యాంగ్ : దక్షిణ కొరియా, జపాన్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా ఆదివారం ఖండించింది. వాటిని నాటో ఆసియా వెర్షన్ అని అభివర్ణించింది. అవి ”ప్రమాదకరమైన పరిణామాలు ”గా హెచ్చరించింది. వార్షిక కసరత్తుల నిర్వహించాలని గత ఏడాది త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే) వ్యతిరేకంగా ఈ సైనిక విన్యాసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మిలటరీ కూటమిని బలోపేతం చేసేందుకు అమెరికా, దాని అనుచరుల ఎత్తుగడలను డీపీఆర్కే ఎప్పటికీ పట్టించుకోదని తెలిపింది.